భార్యతో విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్

టీమిండియా స్టార్ ప్లేయర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)కు విడాకులు ఇచ్చాడు. గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న ఈ జంటకు ఇవాళ (మార్చి 20వ తేదీ) ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా తెలిపారు.

విడాకులు తీసుకున్న స్టార్ కపుల్

విడాకుల పిటిషన్ విచారణ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం చాహల్, ధన శ్రీ కోర్టుకు చేరుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ (Cooling Of Period) గడువును బాంబే హైకోర్టు (Bombay High Court) రద్దు చేసినట్లు లాయర్ నితిన్ కుమార్ గుప్తా తెలిపారు. మార్చి 20వ తేదీలోగా విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే న్యాయస్థానం ఆదేశించగా..  విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు తాజాగా ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.

ధనశ్రీకి రూ.4.75 కోట్ల భరణం

ఈ క్రమంలో ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు తెలిసింది.  ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించినట్లు ముంబయి మీడియా వర్గాల సమాచారం. 2020లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడం, ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ జంట విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలకు బలాన్ని చేకూర్చేలా ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ మరింత చర్చకు దారితీసేలా చేశారు. తాజాగా విడాకులు మంజూరు కావడంతో ఈ జంట విడిపోయినట్లు అధికారికంగా తెలిసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *