
టీమిండియా స్టార్ ప్లేయర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)కు విడాకులు ఇచ్చాడు. గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న ఈ జంటకు ఇవాళ (మార్చి 20వ తేదీ) ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా తెలిపారు.
Yuzi Chahal wears tshirt with slogan written “Be your own sugar daddy” when he visits family court for divorce. Be your own sugar daddy means — take your own financial responsibility, dont rely on someone’s gifts or aid. Taking dig at Dhanashree!pic.twitter.com/dTqA277RNv pic.twitter.com/MNItAXK4X4
— Sachin Kr Yadav (@abhyoday_singh) March 20, 2025
విడాకులు తీసుకున్న స్టార్ కపుల్
విడాకుల పిటిషన్ విచారణ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం చాహల్, ధన శ్రీ కోర్టుకు చేరుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ (Cooling Of Period) గడువును బాంబే హైకోర్టు (Bombay High Court) రద్దు చేసినట్లు లాయర్ నితిన్ కుమార్ గుప్తా తెలిపారు. మార్చి 20వ తేదీలోగా విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే న్యాయస్థానం ఆదేశించగా.. విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు తాజాగా ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.
Yuzvendra Chahal and Dhanashree reached Bombay High Court today
and finalized their divorce case,Rich people are smart,
They settle their case by taking money,
Poor people commit crimes like Muskan, Saurabh and Sahil Shukla of Meerut,
And then suffer, pic.twitter.com/jNFO7DJrSJ
— Pardeep Kaushik (@myaaravnishu) March 20, 2025
ధనశ్రీకి రూ.4.75 కోట్ల భరణం
ఈ క్రమంలో ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించినట్లు ముంబయి మీడియా వర్గాల సమాచారం. 2020లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడం, ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ జంట విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలకు బలాన్ని చేకూర్చేలా ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ మరింత చర్చకు దారితీసేలా చేశారు. తాజాగా విడాకులు మంజూరు కావడంతో ఈ జంట విడిపోయినట్లు అధికారికంగా తెలిసింది.