Megastar Chiranjeevi: కంగ్రాట్స్ పెద్దమామ: సాయిదుర్గ తేజ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. సినీ ఇండస్ట్రీలోనూ, నిజ జీవితంలోనూ ఆయనకు ఆయనే సాటి. కేవలం తెలుగురాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆయనకు అభిమానులు ఉన్నారు. 150కి పైగా సినిమాల్లో నటించినా.. సామాన్యులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఆయన సేవలకు గానూ UKకు చెందిన బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు(Lifetime Achievement Award)తో సత్కరించింది. ఈ సందర్భంగా చిరు కాస్త ఎమోషనల్ అయ్యారు. తన జీవనప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు పురస్కారం అందుకున్న మెగాస్టార్‌కు పలువురు సినీ, రాజకీయ నేతలు అభినందనలు చెబుతున్నారు.

Image

మొదటి ఇండియన్ హీరో మెగాస్టార్

ఈ నేపథ్యంలో చిరంజీవి మేనల్లుడు సాయిదుర్గ తేజ్(Sai Durgha Tej) కూడా తన మామకు కంగ్రాట్స్(Congtratulations) చెప్పాడు. ఈ మేరకు ‘X’ ద్వారా ట్వీట్ చేశాడు. ‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది పెదమామ. బ్రిడ్జ్ ఇండియా(Bridge India) నుంచి జీవిత సాఫల్య పురస్కారం(Lifetime Achievement Award) అందుకున్న మొదటి ఇండియన్ హీరోవి మీరే కావడం చాలా సంతోషంగా ఉంది. UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌(House of Commons)లో గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు మధ్య మీరు పురస్కారం అందుకోవడం మమ్మల్ని చాలా గర్వపడేలా చేసింది. మీరెప్పటికీ మాకు స్ఫూర్తిగానే నిలుస్తారు. మీ లాంటి వ్యక్తి మాకు ఉండటం అదృష్టం’’ అంటూ రాసుకొచ్చాడు. దాంతో ఆయన ట్వీట్(Tweet) వైరల్ అవుతోంది. ప్రస్తుతం సాయితేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో నటిస్తున్నాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *