గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchibabu Sana)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే కాకినాడ, ఢిల్లీ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా నుంచి ఇటీవలే హీరోయిన్ జాన్వీ కపూర్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఇక మార్చి 28వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. చెర్రీ బర్త్ డే ట్రీట్ గా RC16 నుంచి హీరో లుక్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
చెర్రీ బస్త్ డే స్పెషల్
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చెర్రీ వివిధ రకాల ఆటలు ఆడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఆటకు సంబంధించిన లుక్ (RC16 First Look) రిలీజ్ చేస్తారో లేక ఈ సినిమాకు సంబంధించిన మరేదైనా అప్డేట్ ఇస్తారో చూడాలి. అయితే చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో రామ్ చరణ్ తో ఫొటోషూట్ నిర్వహిస్తున్నారట. 28వ తేదీన చెర్రీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసేందుకే ఈ ఫొటోషూట్ చేస్తున్నట్లు సమాచారం.
చెర్రీ, శివన్న మధ్య కుస్తీ ఫైట్
రామ్ చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. చెర్రీకి, శివన్నకు మధ్య కుస్తీ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే శివన్న లుక్ టెస్టు కూడా పూర్తయింది. ఇక ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గేమ్ ఛేంజర్ తో బోల్తా పడ్డ చెర్రీ ఈ సినిమాతో పికప్ అవుతాడని నెటిజన్లు భావిస్తున్నారు.






