ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps) వ్యవహారం సంచలనం రేపుతోంది. టాలీవుడ్(Tollywood)లోని స్టార్ నటీనటుల నుంచి బుల్లితెర, యూట్యూబర్ల వరకూ బెట్టింగ్ భూతంతో సంబంధం ఉందంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల రానా దగ్గుబాటి(Rana Daggibati), విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల వంటి స్టార్ సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మరో ముగ్గురు స్టార్ యాక్టర్స్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది.
వీరి వల్ల చాలా మంది నష్టపోయారంటూ ఫిర్యాదు
తాజాగా కేసులో అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), గోపీచంద్(Gopichand)లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరు బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేశారంటూ హైదరాబాద్ పోలీసులకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు అందింది. రామారావు(Ramarao) అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. FUNN88 అనే బెట్టింగ్ యాప్‌కు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రచారం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద హీరోలు ప్రమోటింగ్ చేయడం వల్ల చాలామంది ఈ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారని రామారావు వివరించారు. తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బ్రేకింగ్ న్యూస్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు చేసిన రామారావు అనే వ్యక్తి
ఫన్88 బెట్టింగ్ యాప్ కోసం ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్న ఫిర్యాదుదారుడు pic.twitter.com/2D6M9I9ahg
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2025
కాగా ఈ కేసులో సిరి హనుమంతు, శ్రీముఖి(Srimukhi), వర్షిణి, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరిలపై కేసు నమోదు కాదా వీరితోపాటు నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు(Pandu), ఇమ్మాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భవ్యసన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజా(Testy Teja), రీతూ చౌదరి తదితరులు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు.