సల్మాన్‌ఖాన్ (Salman Khan), రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(AR Muragadoss) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సికందర్’ (Sikandar). రంజాన్ కానుకగా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్(
Trailer release event) నిర్వహించారు. ఈ వేడుకలోనే హీరో హీరోయిన్ల వయసు తేడా గురించి ప్రశ్న ఎదురవగా సల్మాన్ ఖాన్ స్పందించాడు. ఆమెకు లేని ఇబ్బంది మీకెందుకు? అని ఎదురు ప్రశ్నించారు.
” There is 31 years of age difference between heroine and Me, but the heroine has no problem , heroine’s father has no problem, then what is your problem,bhai.! ” #SikandarTraiIer #SalmanKhan pic.twitter.com/NXMRqTb9Is
— Content Media (@contentmedia__) March 23, 2025
‘‘నాకు, హీరోయిన్‌కి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్‌కు గానీ, ఆమె తండ్రికి గానీ లేని సమస్య మీకెందుకు? రష్మికకు పెళ్లై పాప పుడితే ఆమె కూడా బిగ్ స్టార్(Big Star) అవుతుంది. కలిసి నటిస్తాం. అప్పుడు కూడా.. తల్లిగా రష్మిక అనుమతి తప్పనిసరిగా తీసుకుంటా’’ అని సమాధానమిచ్చారు. దీంతో స్టేజీ మీద ఉన్న వారంతా నవ్వారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో సత్యరాజ్(Satya raj), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మురుగదాస్ చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీని తెరకెక్కించాడు.







