CSK vs MI: చెపాక్‌లో చెన్నైదే విజయం.. MIపై 4 వికెట్ల తేడాతో CSK విన్

ఐపీఎల్-2025 మూడో మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్(CSK) విజయం సాధించింది. ఆదివారం రాత్రి చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ లోస్కోరింగ్ మ్యాచులో ముంబై ఇండియన్స్‌(MI)పై CSK 4 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో శుభారంభం చేసింది. ఈ మేరకు 156 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి చెన్నై ఛేదించి విజయాన్ని అందుకుంది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా.. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి చెన్నైని గెలిపించాడు. ముంబై తరఫున విగ్నేశ్ పుత్తూర్ 3 వికెట్లతో మెరిశాడు.

ముంబై అతికష్టం మీద..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన MI 20 ఓవర్లలో 9 వికెట్లకు అతికష్టం మీద 155 పరుగులు మాత్రమే చేసింది. చెపాక్ స్టేడియంలో చెన్నై బౌలర్లు మరోసారి రాణించారు. నూర్ అహ్మద్ 4 వికెట్లతో మెరిశాడు. ఖలీల్ అహ్మద్ కు 3 వికెట్లు దక్కాయి. వీరిద్దరి ధాటికి MI ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. తిలక్ వర్మ (25 బంతుల్లో 31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29) నిరాశ పరిచాడు. చివర్లో దీపక్ చహర్ (15 బంతుల్లో 29 నాటౌట్) ధాటిగా ఆడటంతో ముంబై ఇండియన్స్ 155 మార్కుకు చేరింది. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ మ్యాచులో డకౌట్ అయ్యాడు.

Is Rohit Sharma Injured? Why Is Ex-MI Captain Absent On The Field vs CSK? |  cricket.one - OneCricket

నేడు వైజాగ్‌లో LSG vs DC

ఇదిలా ఉండగా IPLలో ముంబై ఇండియన్స్ ఓ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. 2013 నుంచి ప్రతీ సీజన్‌లో తొలి మ్యాచ్ ఓడిపోవడం అలవాటుగా మార్చుకుంది. తాజాగా CSKతో మ్యాచులోనూ ఓడిపోయింది. ఇలా వరుసగా 13 ఓపెనింగ్ మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. అయితే 2013 నుంచి 5 సార్లు ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం. ఇక ఐపీఎల్‌లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 5 సార్లు తలపడగా LSG 3, DC 2 మ్యాచుల్లో గెలిచింది. రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

DC vs LSG Dream11 Prediction, IPL 2025 Match 4 Fantasy Cricket Tips, Team,  Playing XI, and Pitch Report - Cricxtasy

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *