పార్లమెంట్​లో ‘ఛావా’ స్పెషల్ షో.. వీక్షించనున్న ప్రధాని మోదీ

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘ఛావా (Chhaava)’. ఫిబ్రవరి 14వ తేదీన  విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఔరంగజేబు పాత్రను అక్షయ్‌ ఖన్నా పోషించారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది.

పార్లమెంట్​లో ఛావా స్క్రీనింగ్

ప్రేక్షకులనే కాకుండా విమర్శకులనూ మెప్పించిన  ‘ఛావా’ సినిమాను పార్లమెంట్​లో (Chhaava Screening in Parliament) ప్రదర్శించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ లోని బాలయోగి ఆడిటోరియంలో ఈ నెల 27వ తేదీన గురువారం రోజున స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఈ స్క్రీనింగ్ కు హాజరు కానున్నట్లు సమాచారం. విక్కీ కౌశల్‌ సహా చిత్ర బృందం కూడా ఈ కార్యక్రమానికి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Image

‘ఛావా’పై ప్రధాని ప్రసంసలు

ఛావా సినిమాపై ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసలు కురిపించారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘ఛావా’ ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుందని తెలిపారు. శివాజీ సావంత్‌ మరాఠీ నవల వల్లే ఈ శంభాజీ మహరాజ్‌ వీరత్వాన్ని చిత్ర రూపంలో పరిచయం చేయడం సాధ్యమైందని అన్నారు. హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబయి కీలకపాత్ర పోషించిందని కొనియాడారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *