వైవిధ్యమైన కథలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో ముందుంటాడు హీరో సంపూర్ణేష్ బాబు(Sampuranesh Babu). తన మేనరిజమ్‌తో అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే ‘సోదరా(Sodara)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్(Sanjosh) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ హాలిడేస్ కానుకగా ఏప్రిల్ 11న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్(Promotions) కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఆ సాంగ్‌కు 1.1 మిలియన్ వ్యూస్
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్(Poster), 4 పాటల(Songs)కు మంచి స్పందన లభిస్తోంది. ‘తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోంది. తప్పకుండా మా సోదరా చిత్రం ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ అన్నారు. కాగా ఈ మూవీలోని ‘నను జూసీనావే పిల్లా.. నా కలలే నిజమయ్యేలా’ అనే సాంగ్ 1.1 మిలియన్ వ్యూస్ సాధించింది.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌పై దృష్టి
ఇప్పటికే షూటింగ్(Shooting) కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌పై దృష్టిసారించింది. మన్మోహన్ మేనంపల్లి(Manmohan Menampally) దర్శకత్వంలో క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం(Can Entertainments Banner)పై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే ‘సోదరా’ చిత్రమని అన్నారు.






