Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ రేటు ఎంతంటే?

బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన రేట్లు ఇవాళ కాస్త భారీగానే హైక్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు క్రమంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఎప్పుడు తగ్గుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, ముంబైలోనూ పుత్తడి ధరలు ఆకాశాన్నంటాయి. అటు వెండి సైతం బంగారానికి ఏమాత్రం తీసిపోకుండా పెరుగుతూనే ఉంది. ఇవాళ (మార్చి 27) తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి(Silver Price) ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఊహించని రీతిలో.. మరోమారు తగ్గిన బంగారం ధరలు | Today Gold and Silver Price  March 22nd 2025 | Sakshi

☛ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరిగి రూ.82,350గా కొనసాగుతోంది
☛ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగి రూ.89,840 వద్ద ట్రేడ్ అవుతోంది.
☛ ఇక కేజీ వెండి ధరలో ఏమాత్రం మార్పులు లేకుండా రూ.1,11,000గా నమోదవుతోంది.

నష్టాలతో ప్రారంభమై.. చివరకు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు(Stock Markets) ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆటో షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచడంతో, మార్కెట్ తొలుత నష్టాల్లో ప్రారంభమైంది. అయితే, ప్రధాన షేర్ల(Shares)లో కొనుగోళ్ల మద్దతుతో కొద్ది సేపటికే లాభాల్లోకి దూసుకొచ్చాయి. దీంతో గురువారం ఉదయం 10.10 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 411.13 పాయింట్ల లాభంతో 77,699.63 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ (Nifty) 117.45 పాయింట్ల లాభంతో 23,604.30వద్ద కొనసాగింది.

March Mania: Nifty 50 shows strong seasonality, positive in 7 of the last  10 years

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *