
తెలంగాణ(Telangana)లో పలువురు (MLC)ల పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ మేరకు BRS ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గే మల్లేశంతోపాటు కాంగ్రెస్(Congress) ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉన్నారు. వీరితోపాటు MIM సభ్యుడు మీర్జారియాజ్ ఉల్‌హసన్ అఫెండీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC)లు నర్సిరెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి ఉన్నారు. వీరికి గురువారం మండలిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జీవన్ రెడ్డి అసంతృప్తి.. కానీ!
ఇదిలా ఉండగా మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై ఇటీవల జీవన్ రెడ్డి(Jeevan Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికైనా పదవి రాకపోతే అసంతృప్తి ఉండడం సహజమేనని, అయితే కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. పదవులతో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. కాగా కాంగ్రెస్ ఇటీవల్ విజయశాంతి(Vijayashanti), అద్దంకి దయాకర్(Addanki Dayakar)ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.