ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో మెగా-అల్లు వివాదం (Mega Allu Controversy) తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అంతకుముందు నుంచే ఈ రెండు కుటుంబాలకు అసలు పొసగడం లేదనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు మద్దతు ప్రకటించకుండా బన్నీ వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడంతో ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఆ సమయంలో నాగబాబు ట్వీట్స్, సాయిదుర్గా తేజ్ బన్నీని సోషల్ మీడియాలో అన్ ఫాలో కావడం ఇవన్నీ ఈ వార్తలకు బలం చేకూర్చాయి.
అలా మొదలైంది
అయితే పుష్ప-2 బెనిఫిట్ షో ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest) అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి బన్నీకి మద్దతుగా నిలవడంతో ఈ వివాదానికి తెరపడిందని అంతా భావించారు. ఆ రెండు కుటుంబాలు కలిసే ఉన్నాయని అనుకున్నారు. ఇక అంతే సెట్ అయినట్లేనని భావిస్తుండగా రామ్ చరణ్ (Ram Charan Birth Day) పుట్టిన రోజు మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు అంతా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
మళ్లీ షురూ అయింది
కానీ అల్లు అర్జున్ మాత్రం కనీసం ఒక్క సోషల్ మీడియా పోస్టు కూడా పెట్టలేదు. మెగా-అల్లు వివాదం వల్లే బన్నీ చెర్రీకి విషెస్ చెప్పలేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే చెర్రీ బన్నీని ఇన్ స్టాలో అన్ ఫాలో చేశాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బన్నీ విష్ చేయకపోవడం మరోసారి చర్చనీయాంశమవుతోంది. అయితే చెర్రీ సతీమణి ఉపాసన (Upasana Konidela) మాత్రం బన్నీని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. ఇక చెర్రీ, బన్నీ సినిమాల సంగతికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది (Peddi) అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక బన్నీ అట్లీతో కలిసి ఓ మూవీకి ఓకే చెప్పాడు.






