‘మ్యాడ్​ స్క్వేర్​’ పబ్లిక్ టాక్.. లడ్డూ పెళ్లిలో సందడే సందడి

శుక్రవారం వచ్చేసింది. వినోదాలు వడ్డించేందుకు పలు సినిమాలు వచ్చేశాయి. రాబిన్ హుడ్ (RobinHood), మ్యాడ్ స్క్వేర్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ముఖ్యంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూత్​ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్వ్కేర్ (MAD Square)’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 28న) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?

సునిల్ సర్ ప్రైజ్

ఇవాళే థియేటర్లకు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ (MAD Square Review) సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో కామెడీ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. మూవీ ఫస్టాఫ్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ చిత్రంలో లడ్డూ పాత్రకు తండ్రిగా నటించిన మురళీధర్ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లడ్డూ పెళ్లి సీక్వెన్స్ నవ్వులు పంచిందని.. ఈ పెళ్లి సందడి అంతా ఇంతా కాదంటూ మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. సునిల్ కామియో సర్ ప్రైజ్ చేస్తుందని ఇంకొకరు రాసుకొచ్చారు.

ఫస్ట్ డే పాజిటివ్ టాక్

మ్యాడ్ స్క్వేర్ మూవీ యూత్ కు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుందని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇక భీమ్స్ (Bheems Songs) సాంగ్స్ మరోసారి యువతను ఉర్రూతలూగిస్తాయని ప్రేక్షకులు అంటున్నారు. కొన్ని సీన్స్ మాత్రం కావాలని ఏదో చొప్పించినట్లుగా ఉన్నాయని.. అవి లేకపోయినా సినిమా బాగుండేదని ఓ నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ డే టాక్ చాలా పాజిటివ్ గా కనిపిస్తోంది. మరి కలెక్షన్లు ఎలా వస్తాయో చూడాలి.

థియేటర్లో నవ్వుల పువ్వులు

ఈ సినిమా విషయానికొస్తే 2023లో విడుదలైన ‘మ్యాడ్​ (MAD)’ మూవీకి సీక్వెల్​గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. నార్నే నితిన్‌ (Narne Nithin) నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన  ‘మ్యాడ్‌’లో రామ్ నితిన్​తో పాటు సంగీత్ శోభన్​, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు  కీలక పాత్రలు పోషించారు. సెకండ్ పార్ట్ లోనూ దాదాపు ఈ నటులే ఉన్నారు. ఇక తొలి పార్ట్​ కంటే, సెకండ్ పార్ట్  డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని మేకర్స్ చెప్పినట్లుగానే థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్ మూవీ నవ్వులు పూయిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *