
ఛలో, భీష్మ సినిమాలతో కామెడీ, మాస్ ఎంటర్టైనర్ డైరెక్టర్‌గా వెంకీ కుడుముల (venky kudumula) మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు యంగ్ హీరో నితిన్ (Nithin)తో కలిసి రాబిన్ హుడ్ (Robinhood) సినిమా తీశాడు. శ్రీలీలీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మార్చి 28వ తేదీ (ఇవాళ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచి డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఇక ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించారు. ప్రమోషన్స్ లో వార్నర్ కూడా చాలా యాక్టివ్ గా కనిపించాడు. మరి ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పించిందా చూద్దామా..?
Show completed:- #Robinhood
Fun entertainer 👍
Above average movie 2.75/5First half is good
Okayish Second halfNot a story based film … go with the flow
Go with your family , have fun#Robinhood series will continue… 2nd part villain @davidwarner31 pic.twitter.com/yrd3PGpsl6— venkatesh kilaru (@kilaru_venki) March 27, 2025
ఫ్రెష్ కామెడీ అదిరింది
ఇవాళే థియేటర్లలో విడుదలైన రాబిన్ హుడ్ (Robinhood Twitter Review) సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు రివ్యూ ఇస్తున్నారు. ఈ చిత్రం మొదటి షోను చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలను నెట్టింట వ్యక్తపరుస్తున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు ఈ చిత్రం ఫస్టాఫ్ అదిరిపోయిందని చెబుతున్నారు. మూవీలో కామెడీ చాలా ఫ్రెష్ గా ఉందని అంటున్నారు. డార్క్ కామెడీ కాకుండా లైట్ కామెడీతో ఫన్ పుట్టించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్స్, ఇంటర్వెల్ బోరింగ్ గా ఉన్నాయని కొందరు అంటున్నారు.
One Word – VERYGOOD FILM ✅#Nithin Come Back With a GOOD CHARACTER With MULTIPLE TWISTS 🔥🔥🔥🔥#Warner Bhai Entry WHISTLES – CLEAN Comedy and Get Ready For #Robinhood Part 2 💥💥💥💥#GetsCinema – Reached – HYPEMETER – 88%#RobinhoodReview
— GetsCinema (@GetsCinema) March 28, 2025
డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదుర్స్
అయితే సెకండాఫ్ కాస్త బోర్ గా అనిపించిందని ఓ నెటిజన్ అన్నాడు. ఓవరాల్ గా మాత్రం సినిమా ఓకే అని చెప్పాడు. ఫస్టాఫ్ కామెడీ మాత్రం అదిరిపోయిందని చాలా మంది ఆడియెన్స్ అంటున్నారు. నితిన్, శ్రీలీల (Sreeleela) చాలా యాక్టివ్ గా కనిపిస్తారని చెప్పారు. వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ అయిందని చెబుతున్నారు. అదిదా సర్ ప్రైజు సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లోల ఈలలే ఈలలు. ఇక డేవిడ్ వార్నర్ (David Warner) ఎంట్రీ సమయంలో థియేటర్లో ఫ్యాన్స్ పూనకాలు పెట్టారట. మొత్తానికి రాబిన్ హుడ్ సినిమా ఓ కామెడీ ఎంటర్టైనర్ అని ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్ చేయొచ్చని చెబుతున్నారు.