The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’.. రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

భారతీయ సినీ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన వెబ్ సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ (The Family Man)’  ఒకటి. కరోనా సమయంలో ఈ సిరీస్ సీజన్-1 వచ్చి ఇండియన్ ఆడియెన్స్ మనసు దోచేసింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అదిరిపోయే కథతో అలరించింది. ఆ తర్వాత వచ్చిన సీజన్-2 కూడా ఆకట్టుకుంది. ఈ సిరీస్ కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ ఇప్పుడు పార్ట్-3 ప్లాన్ చేశారు. ఇప్పటికే షూటింగు పూర్తి చేసుకున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 నుంచి తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.

సీజన్-3 స్ట్రీమింగ్ డేట్

రాజ్ అండ్ డీకే (Raj & DK) దర్శకద్వయం తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రీకాంత్ అనే ప్రధాన పాత్రలో నటించిన మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee) తాజాగా సీజన్-3 గురించి అప్డేట్స్ షేర్ చేసుకున్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్ తో మాట్లాడిన ఆయన మొదటి రెండు సీజన్ల కంటే మూడో సీజన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందులో మరో బాలీవుడ్ యాక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని వెల్లడించారు.

సీజన్-3లో మరో టాలెంటెడ్ నటుడు

అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే వచ్చిన ‘పాతాళ్‌లోక్‌’ అనే సిరీస్ లో నటుడు జయదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat) తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’లో కనిపిస్తారని మనోజ్ బాజ్ పాయ్ తెలిపారు. రెండేళ్ల క్రితమే ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని వెల్లడించారు. ఆయన క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. స్టోరీని కీలక మలుపు తిప్పుతుందని చెబుతూ సీజన్-3పై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇక పార్ట్‌ 3లో జైదీప్‌ అహ్లావత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *