తెలంగాణ(Telangana)లో మహిళలకు ఫ్రీ బస్ సర్వీసులు(Free Bus Suervice) అందిస్తోన్న RTC ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ జేఏసీ(RTC JAC) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(RTC MD VC Sajjanar), లేబర్ కమిషనర్‌కు సోమవారం (ఏప్రిల్ 7) సాయంత్రం సమ్మె నోటీసులు(Notice) అందజేశారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు, పెండింగ్ జీతాలు విడుదల చేయాలని వారు తమ నోటీసుల్లో స్పష్టం చేశారు.
యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతోనే..
కాగా జనవరి 27న తమ డిమాండ్లు(Demands) పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని ఇదివరకే ఆర్టీసీ జాక్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. సమ్మెకు నోటీసులు(Notice) ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకే సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం లేబర్ ఆఫీసు(Labour Office)లో సమావేశం అయిన నేతలు.. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. తమ సమ్మెకు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, అన్ని యూనియన్లు కలిసిరావాలని కోరారు.
#Hyderabad—#TGSRTC JAC to go on strike from May 7, for the implementation of 21 demands, including their merger with the state government, first proposed through a government order in 2013.
JAC leaders served notices to @TGSRTCHQ managing director @SajjanarVC and Labour…
— NewsMeter (@NewsMeter_In) April 7, 2025






