RCB vs MI: ముంబైకి తప్పని నిరాశ.. ఉత్కంఠ పోరులో RCB గెలుపు

ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌(MI)కు మరో షాక్ తగిలింది. సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌(RCB)తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. చివరి ఓవర్ వరకూ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో ఒత్తిడిని జయించలేక పరాజయం పాలైంది. దీంతో బెంగళూరు ఖాతాలో మూడో విజయం చేరగా.. ముంబై జట్టు ఆడిన 5 మ్యాచుల్లో నాలుగింట్లో ఓడింది.

కోహ్లీ, పాటీదార్ అర్ధసెంచరీలు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 221/5 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కింగ్ కోహ్లీ (42 బంతుల్లో 67 పరుగుల)తో చెలరేగగా.. పడిక్కల్ 37 రన్స్ చేశాడు. అనంతరం కెప్టెన్ పాటీదార్ (32 బంతుల్లో 64 రన్స్‌)తో సూపర్ ఫిఫ్టీ సాధించాడు. చివర్లో జితేశ్ శర్మ (19 బంతుల్లో 40) రన్స్ చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో పాండ్య, బౌల్ట్ చెరో రెండు వికెట్లు తీయగా, పుతూర్ ఒక వికెట్ పటగొట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ 17 రన్స్ చేసి మరోసారి నిరాశపర్చగా రికెల్టన్ 17 రన్స్ చేసి ఔటయ్యాడు.

తిప్పేసిన కృనాల్ పాండ్య

అనంతరం విల్ జాక్స్(22), సూర్య కుమార్ (28) స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఔటవడంతో ముంబై ఆశలు సన్నగిల్లాయి. ఆ సమయంలో తిలక్ వర్మ 29 బంతుల్లో 56, కెప్టెన్ పాండ్య 15 బంతుల్లో 42 మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై గెలుపుదిశగా పయనించింది. ఈ క్రమంలో వీరిద్దరూ వెంటవెంటనే ఔటవ్వడంతో ముంబై కష్టాల్లో పడింది. చివరి ఓవర్లో 19 రన్స్ చేయాల్సి ఉండగా కృనాల్ పాండ్య అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతడు కేవలం 6 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మొత్తంగా కృనాల్ 4 వికెట్లు తీయగా, యశ్ దయాల్, హేజిల్ వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ ఒక వికెట్ పడగొట్టాడు. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆర్సీబీ బ్యాటర్ కమ్ కెప్టెన్ రజత్ పాటీదార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *