LPG Price: వంటగ్యాస్ ధరల పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ప్రైస్ ఎంతంటే?

వంటగ్యాస్ వినియోగదారుల(For Cooking gas users)కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఉజ్వల, సాధారణ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు నిన్న కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Union Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు సరఫరా కంపెనీలు రూ.50 చొప్పున పెంచడంతోనే తాము సిలిండర్ ధర పెంచాల్సి వచ్చింది మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీంతో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌(LPG Cylinder) ధర ఢిల్లీలో రూ.803 నుంచి రూ.853 వరకు పెరిగింది.

 

 తెలుగు రాస్ట్రాల్లో ఇలా..

 

ఇక హైదరాబాద్‌(HYD)లో రూ.855 నుంచి రూ.905, వరంగల్‌(WGL)లో రూ.874 నుంచి రూ.924కి చేరింది. ఏపీలోని విజయవాడ (Vijayawada)లో రూ.825.50 నుంచి రూ.875.50కు చేరింది. కాగా ఈనెల 7వ తేదీలోపు సిలిండర్ల కోసం ఆన్లైన్లో చెల్లింపులు(Online Payments) చేసినా 8వ తేదీన డెలివరీ చేస్తే మిగతా రూ.50 కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ(TG)లో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) లబ్ధిదారులు మినహా మిగతా LPG గ్యాస్‌ వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది. అలాగే రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉజ్వల పథకం(Ujjwala Yojana) లబ్ధిదారులకూ పెంచిన ధర వర్తించనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *