పవన్ కుమారుడు ‘మార్క్’ హెల్త్ బులెటిన్.. ఎలా ఉన్నాడంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్‌(Mark Shankar)కు గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిన్నారి సింగపూర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మార్క్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలయింది. మార్క్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం పలు వైద్య పరీక్షలు నిర్వహించాం. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో పలు ఇబ్బందులు తలెత్తాయి. వాటిపై పరీక్షలు చేస్తున్నాం. మరో మూడ్రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. అని వైద్యులు తెలిపినట్లు జనసేన వర్గాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశాయి.

మార్క్ హెల్త్ బులెటిన్

ఇక తన కుమారుడు మార్క్ ను చూసేందుకు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట సోదరుడు చిరంజీవి (Chiranjeevi) దంపతులు కూడా వెళ్లారు. మార్క్‌ కోలుకుంటున్నాడని.. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు పవన్‌కు తెలిపినట్లు సమాచారం. మరోవైపు పవన్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సానుభూతి ప్రకటిస్తున్నారు. మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

Image

ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్

ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ తనయుడికి జరిగిన ప్రమాదంపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌ చిక్కుకున్నాడని తెలిసి బాధపడ్డానని తెలిపారు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పిన తారక్.. ధైర్యంగా ఉండు లిటిల్‌ వారియర్‌  అని తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ సమయంలో పవన్‌ కుటుంబ సభ్యులంతా కూడా ధైర్యంగా ఉండాలని ఎన్టీఆర్‌ కోరారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *