
టాలీవుడ్ లో గత కొంతకాలంగా మంచు కుటుంబం వివాదం (Manchu Family Dispute) చర్చనీయాంశమవుతోంది. అయితే కొద్దిరోజుల నుంచి సద్దుమణిగిన ఈ గొడవ మళ్లీ మంచు విష్ణుపై మనోజ్ (Manchu Manoj) ఫిర్యాదుతో తెరపైకి వచ్చింది. తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తాను రాజస్థాన్ వెళ్లగా.. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని చూసి తన సోదరుడు విష్ణు, మరికొంత మందితో కలిసి చొరబడ్డారని మనోజ్ ఆరోపించారు. తన కారును ఎత్తుకెళ్లారని, ఇంట్లో విధ్వంసం సృష్టించారని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మళ్లీ రగిలింది
జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్ ఆందోళనకు దిగారు. తన కూతురు బర్త్ డే వేడుకలకు రాజస్థాన్‌కు వెళ్లగా.. తన ఇంట్లోని కారు, వస్తువులను అపహరించారని మనోజ్ ఆరోపించారు. మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని… pic.twitter.com/R1S7ZIEjTE
— ChotaNews App (@ChotaNewsApp) April 9, 2025
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ బైఠాయింపు
అయితే ఈ విషయంపై తన తండ్రి మంచు మోహన్ బాబు(Mohan Babu)తో మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన నుంచి స్పందన రాలేదని మనోజ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంచు మనోజ్ బైఠాయించాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన ఇంటి బయటే బైఠాయించాడు. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయి ఇంటి చుట్టూ భద్రత ఏర్పాటు చేశారు.
నా కారు ఎత్తుకెళ్లాడు
పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకొని ఆయన సోదరుడు విష్ణు (Manchu Vishnu) ఇదంతా చేయిస్తున్నారని మనోజ్ ఆరోపించాడు. ఈనెల 1వ తేదీన తన పాప పుట్టినరోజు సందర్భంగా జయపుర వెళ్లగా సోదరుడు విష్ణు 150 మందితో జల్‌పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రి ధ్వంసం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని పోలీసులకు తెలిపాడు. జల్‌పల్లిలో తన భద్రతా సిబ్బందిపై దాడి చేశారని.. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారని.. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్‌కు పంపించారని మనోజ్ వెల్లడించాడు.