హారర్ కామెడీతో వస్తున్నా.. RGV నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే!

టాలీవుడ్(Tollywood) వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తన నెక్ట్స్ ప్రాజెక్టు ప్రకటించాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా మూవీ టైటిల్(Title), స్టోరీ ట్యాగ్ లైన్ తదితర వివరాలు వెల్లడించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన ‘శారీ(Saree)’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓ ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిని ఇందులో హీరోయిన్‌గా పెట్టాడు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 4న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన తర్వాతి చిత్రాన్ని ప్రకటిస్తూ ట్విటర్‌(X)లో షాకింగ్ పోస్ట్ చేశాడు.

ఇది వరకూ చేయని హారర్ కామెడీ జానర్‌లో..

‘‘ సత్య, కౌన్ స్కూల్ తర్వాత నేను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది, నేను, మనోజ్ బాజ్‌పేయి(Manoj Bajpayee) మేమిద్దరం చేయని హారర్ కామెడీ జానర్ కోసం మరోసారి జతకట్టాం’’ అని ఎక్స్ వేదికగా ప్రకటించాడు. నేను హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్ డ్రామాలు, అడ్వెంచర్ కేపర్‌లు, థ్రిల్లర్‌లు మొదలైనవి చేశాను. కానీ ఎప్పుడూ హారర్ కామెడీ చేయలేదు. ఈ చిత్రానికి ‘పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్’ ట్యాగ్ లైన్: You Can’t Kill The Dead అనే టైటిల్ ఫిక్స్ చేశాం’’ అని RGV తెలిపారు.

థ్రిల్లింగ్ హారర్ ఎఫెక్ట్‌లతో..

మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు పరిగెత్తుతాము. కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత, పోలీసు స్టేషన్ హాంటెడ్ స్టేషన్‌గా మారింది. గ్యాంగ్‌స్టర్ల దెయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగులు తీస్తారు. అత్యాధునిక VFX, వెన్నెముక-చిల్లింగ్ హారర్ ఎఫెక్ట్‌(Horror effect)లతో, పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్ మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసే వినోదభరితమైన చిత్రం అవుతుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం RGV ట్వీట్ SMలో వైరల్ అవుతోంది.

Related Posts

Pawan kalyan: ఇష్టమైన హీరోయిన్ గురించి మొదటిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్..

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తాజా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) కొంత గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ, ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలిగించింది.…

ఆ సినిమా నేనే చేసుంటే బాగుండేది.. ఎన్టీఆర్‌ సినిమాపై హృతిక్ కామెంట్ వైరల్..

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లు గుర్తుకొస్తారు. వారు చేసిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *