బంగారం ధరలు (Gold Rates Today) రోజుకో రకంగా ఊగిసలాడుతున్నాయి. ఇటీవల రూ.90వేలకు పైగా పలికిన ధరలు రెండ్రోజుల క్రితం మళ్లీ రూ.89000 వరకు చేరడంతో ఇక పుత్తడి రేట్లు తగ్గినట్లేనని ప్రజలు భావించారు. ఇంతలోనే గత రెండ్రోజులుగా మళ్లీ స్వల్పంగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఇక గురువారం రోజున అయితే ఏకంగా రూ.2900 పెరిగి మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారుల ఆందోళన చెందుతున్నారు.
షాక్ ఇచ్చిన గోల్డ్
అంతర్జాతీయ పరిణామాలు, శుభకార్యాల సీజన్ సమీపిస్తుండటంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే పుత్తడి రేటు ఒక్కసారిగా రూ.3 వేలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే బంగారం కొనేదెలా అని వాపోతున్నారు. దేశవ్యాప్తంగా గురువారం రోజున పలు నగరాల్లో బంగారం రేట్లు రూ.90000 దాటాయి. మరి హైదరాబాద్ మహానగరంలో గోల్డ్ రేట్లు (Gold Price Today) ఎలా ఉన్నాయో చూద్దామా..?
వెండిది కూడా అదే రూటు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు బుధవారం రోజున రూ.90,440 ఉండగా గురువారం నాటికి రూ.2,940 పెరిగి రూ.93,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ తులం ధర బుధవారం నాడు రూ.82,900 ఉండగా ఇవాళ్టికి ఆ రేటు రూ.2700 పెరిగి రూ.85,600 వద్ద పలుకుతోంది. గోల్డ్ తో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బుధవారం కిలో వెండి ధర (Silver Price Today) రూ.91,938 ఉండగా, గురువారం నాటికి రూ.2,708 పెరిగి రూ.94,646కు చేరుకుంది.






