
డొమినికన్ రిపబ్లిక్(Dominican Republic) రాజధాని శాంటో డొమింగో(Santo Domingo)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ నైట్‌క్లబ్‌లో అర్ధరాత్రి కన్సర్ట్ జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. దీంతో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వందమందికి ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. తాజాగా మృతుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 184 మంది మృతి చెందారని, మరో 145 మందికి పైగా గాయాలైనట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే మరణించిన వారిని గుర్తించడంలో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాల కింద పడటంతో శరీరాలు ఛిద్రమయైపోయి గుర్తుపట్టలేనంతగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుండగా..
కాగా శాంటో డొమింగోలోని వన్ స్టోర్ జెట్ సెట్(One Store Jet Set) నైట్‌క్లబ్‌లో మంగళవారం (ఏప్రిల్ 8) రాత్రి ఓ కన్సర్ట్ నిర్వహించారు. ఈక్రమంలోనే వందలాది మంది అక్కడకు వచ్చారు. అంతా కలిసి పాటలు వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తుండగా.. ఒక్కసారిగా పైకప్పు కూలి పడింది. దీంతో అక్కడున్న అనేక మంది శిథాలల కింద చిక్కుకుపోయారు. మరికొంత మంది ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరగులు పెట్టారు. విషయం గుర్తించిన పోలీసులు(Police), రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు.
Dominican Republic ends search for survivors after nightclub roof collapse kills 184, the nation’s worst disaster in decades. Rescue efforts now focus on recovering bodies from Jet Set nightclub in Santo Domingo, where the tragedy struck Tuesday. https://t.co/omdwjaVC9s pic.twitter.com/J3f4OTGYSl
— GeoTechWar (@geotechwar) April 10, 2025