నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవల ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’తో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగానూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇక ఇదే ఊపులో బాలయ్య అఖండ-2(Akhanda-2) మూవీని చేస్తున్నారు. సింహ, లెజెండ్, అఖండ తర్వాత బోయపాటి శ్రీను-బాలయ్య(Boyapati Srinu-Balayya) కాంబోలో రాబోతున్న నాలుగో చిత్రం అఖండ-2. ఈ సినిమాలో బాలకృష్ణను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు.
అనుకున్న టైమ్‌కే థియేటర్లలోకి..
ప్రస్తుతం అఖండ-2 షూటింగ్ జెట్ స్పీడుతో కొనసాగుతోంది. అయితే బాలయ్య-బోయపాటి మధ్య కొన్ని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా స్పందించింది. ‘‘బాలయ్యకి, బోయపాటికి పడట్లేదు’’ అని, ‘‘షూటింగ్ అనుకుంత సజావుగా జరగట్లేదు’’ అంటూ కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని మూటీ టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. మొత్తం షూట్ అనుకున్నట్టే జరుగుతోందని, అనుకున్న టైమ్‌కే థియేటర్లలోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. ఈ క్లారిటీతో బాలయ్య ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా తమన్ సంగీత అందిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.








