TG TET: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టెట్-2025(Telangana State Teacher Eligibility Test) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణలో టెట్ నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్(School Education Department) ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 15న పూర్తి నోటిఫికేషన్(Notification) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.

నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం..

కాగా ఇంటర్ తర్వాత డిప్లమా ఇన్‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌(Diploma in Elementary Education) పూర్తి చేసినవారు TET‌ Paper‌-1 పాసవ్వాలి. డిగ్రీ తర్వాత BEd చేసినవారు టెట్‌‌ పేపర్‌‌-2లో ఉత్తీర్ణత సాధించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్‌‌ 23(1) నేషనల్‌‌ కౌన్సిల్‌‌ ఫర్‌‌ టీచర్‌‌ ఎడ్యుకేషన్‌(National Council for Teacher Education)‌ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టెట్‌‌లో అర్హత పొందడం తప్పనిసరి.

ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయం

ఇప్పటి వరకు DEd, BEd తదితర కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. కానీ, NCTఈ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకూ(Teacher Promotions) టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (Telangana State Teacher Eligibility Test)ను ఇక నుంచి ఏటా 2 సార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏటా జూన్, డిసెంబర్/జనవరిలో నిర్వహించేలా ప్రభుత్వం స్పెషల్ షెడ్యూల్​కూడా ఖరారు చేసింది. గతంలోనే నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌ టీచర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ (ఎన్​సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్‌‌‌‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే.

Related Posts

Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…

Infosys: యువతకు గుడ్‌న్యూస్.. ఈ కోర్స్ లు చేస్తే జాబ్స్ పక్కా.. అంటున్న ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్(Infosys) ఫౌండేషన్ “స్ప్రింగ్‌బోర్డ్ లైవ్‌లీహుడ్ ప్రోగ్రామ్”(“Springboard Livelihood Programme) పేరుతో ఒక విశిష్టమైన సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, భారతదేశ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *