
26/11 ముంబై దాడు(Mumbai Attacks)ల్లో కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణా(Central forces)ను భారత్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని అమెరికా నుంచి NIA అధికారులు ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చి పాటియాలా హౌస్ కోర్టు(Patiala House Court)లో హాజరుపర్చారు. దీంతో అతడికి కోర్టు 18 రోజుల రిమాండ్(Remand) విధించింది. అయితే రాణా అరెస్టు నేపథ్యంలో భారత్‌లో ఉగ్ర దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు(Intelligence Agencies) హెచ్చరించాయి.
డ్రోన్లు, ఐఈడీలతో దాడి చేయొచ్చు..
ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్లు(Drones), ఐఈడీ(IED)లతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించాయి. నదీ మార్గాల్లోనూ ఉగ్రమూకలు దేశంలోకి చొరబడే ఛాన్సుందని పేర్కొన్నాయి. ఈ మేరకు కేంద్ర బలగాలు(Central Forces).. ఆయా రాష్ట్రాల పోలీసుల(State Policeతో సమన్వయం చేసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ముఖ్య నగరాలు, పట్టణాలు, రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలను కేటాయించాలని ఆ శాఖ అధికారులకు సూచించాయి.