ఐపీఎల్-2025లో ఉప్పల్(Uppal) వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 భారీ స్కోరు సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసి కింగ్స్ ఓపెనర్లు జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ప్రియాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36), ప్రభ్ సిమ్రన్ సింగ్ (23 బంతుల్ల్ 42) బౌండరీల వర్షం కురిపించడంతో తొలివికెట్‌కు 4 ఓవర్లలోనే 66 పరుగులు చేసింది. వీరిద్దరూ మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊతికారేశారు.
అయ్యర్ అదరహో..
ఇక ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చీ రాగానే బౌండరీల మోతకెక్కించాడు. కేవలం (36 బంతుల్లో 82) సూపర్ ఫిఫ్టీ సాధించాడు. వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. నెహాల్ వధేరా (27) ఫర్వాలేదనిపించగా.. చివర్లో స్టొయినిస్ సిక్సర్ల సునామీ సృష్టించాడు.
కేవలం 11 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. చివరి ఓవర్లో షమీకి చుక్కలు చూపించాడు. వరుసగా 4 సిక్సర్లు బాది భారీ స్కోరు చేసేలా చేశాడు. ఇక రైజర్స్ బౌలర్లలో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ దారుణంగా విఫలమయ్యాడు. ఇతడు 4 ఓవర్లలో 75 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షల్ పటేల్ ఒక్కడే 4 వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచులో సన్ రైజర్స్ గెలవాలంటే ఓపెనర్లు హెడ్, అభిషేక్ చెలరేగాల్సిందే.






