NBK: ‘అఖండ-2’ నుంచి అప్డేట్.. భారీ యాక్షన్ సీన్స్‌కు ప్లాన్!

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘అఖండ 2(AKhanda 2)’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా(Simha), లెజెండ్‌(Legend), అఖండ(Akhanda) సినిమాలు బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇందులో అఖండ సినిమా పాన్ ఇండియా(Pan india) రేంజ్‌లో ఈ కాంబోకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే ఈ సీక్వెల్ కాస్త ఆలస్యం అయింది. భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌(Daaku Maharaj) సినిమాలు కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో అఖండ 2 సినిమా సైతం ఆలస్యం అయిన విషయం తెల్సిందే.

Balayya's "Akhanda 2" to hail temples, religious practices

అఘోరా పాత్రకోసం అనేక లుక్‌ టెస్టులు

బోయపాటి ఈ సినిమా కోసం చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేశాడట. ముఖ్యంగా అఘోరాల గురించి చాలా విషయాలను తెలుసుకున్నాడట. అంతే కాకుండా బాలయ్యను అఘోరా(Aghora) పాత్రలో చూపించడం కోసం చాలా లుక్ టెస్ట్‌లు చేసి చివరకు ఈ లుక్‌ను ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. అఖండ 2 సినిమాలోనూ బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి అఘోరాగా కనిపించే పాత్ర. మొదటి పార్ట్‌లో అఘోర పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీపై ఇటీవల బోయపాటి వర్క్ విషయమై అసంతృప్తితో ఉన్నాడంటూ సోషల్ మీడియా(SM)లో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Balakrishna reveals plans for Akhanda 2

ఇంటర్వెల్‌కి ముందే ఆ సన్నివేశాలు

తాజా సమాచారం మేరకు ఏప్రిల్‌ మూడో వారంలో ఈ మూవీ యాక్షన్‌ సీన్స్‌(Action Scenes)ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ స్టంట్స్ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్(Stunts choreographer Peter Haynes) ఆధ్వర్యంలో ఈ భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ యాక్షన్‌ సన్నివేశాలు ఇంటర్వెల్‌‌కి ముందు వస్తాయట. ఈ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమా ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకు వెళ్లబోతున్నట్లు దర్శకుడు ఇంటర్వెల్ సమయంలో క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *