
IPL 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మళ్లీ గెలుపు రుచి చూసింది. గత మ్యాచులో సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్(DC) చేతిలో కంగుతిన్న ఆ జట్టు ఇవాళ జైపూర్(Jaipur)లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి రాజస్థాన్ రాయల్స్(RR)కు షాక్ ఇచ్చింది. ఆర్సీబీ బ్యాటర్లు ఫిల్ సాల్ట్(Salt), కింగ్ కోహ్లీ(Kohli) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీ(Green Colour Jersey)లో బరిలోకి దిగింది. కాగా ఈ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్లో కోహ్లీ 100వ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. తద్వారా ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (108) హాఫ్ సెంచరీల తర్వాత కోహ్లీ వంద హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
ఆర్సీబీ నాలుగో విజయం
ఇక జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో 174 పరుగుల ఛేదనలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(65) విధ్వంసక ఆర్ధ శతకంతో మెరిశాడు. సాల్ట్ మెరుపులతో విజయానికి పునాది వేయగా.. ఆ తర్వాత ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(62 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్(40 నాటౌట్) సైతం దూకుడుగా ఆడాడు. రెండో వికెట్‌కు కోహ్లీతో అబేధ్యమైన 83 రన్స్ జోడించాడు. దాంతో, RCB నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. రాయల్స్ బౌలర్లలో కార్తికేయ ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు.
ఆ జట్టులో జైస్వాల్ ఒక్కడే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్(RR)కు జైస్వాల్(75) అర్ధశతకంతో మెరిశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) నిరాశపర్చాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (30), ధ్రువ్ జురెల్ (35) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 173/4 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్ వుడ్, కృనాల్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు. కాగా ఛేదనలో 33 బంతుల్లోనే 65 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది.
Virat Kohli and Phil Salt power RCB to a dominant 9-wicket win over RR!
Kohli finishes unbeaten as Bengaluru chase down 174 with ease#RCBvsRR #ViratKohli #PhilSalt #IPL2025 #RCB #salt
— Ritam English (@english_ritam) April 13, 2025