తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2025) దరఖాస్తుల(Applications) స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టి (April 15) నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు ఆన్‌లైన్(Online)లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్ http://schooledu.telanganga.gov.inలో మరింత సమాచారం పొందవచ్చు. టెట్ పేపర్-1కు DEd, పేపర్-2కు BEd పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. కాగా ఈ నెల 11వ తేదీన టెట్ నోటిఫికేషన్(TET Notification) విడులైన విషయం తెలిసిందే. టెట్ పేపర్ 1 లేదా పేపర్ 2కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు(Regisrtation Fees) కింద రూ.750 దరఖాస్తు సమయంలో చెల్లించవల్సి ఉంటుంది. ఇక రెండు పేపర్లు రాసేవారు రూ. 1000 ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.
పదోన్నతులు కావాలంటే టెట్ తప్పనిసరి
ఇక జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు టెట్ పరీక్షలు నిర్వహించనుండగా, జూన్ 9 నుంచి హాల్ టికెట్ల(Hall Ticket) డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. జులై 22న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా DEd, BEd పూర్తి చేసిన నిరుద్యోగులతోపాటు కొత్తగా సర్వీస్ టీచర్లు కూడా టెట్‌కు హాజరవుతున్నారు. వీరికి పదోన్నతులు కావాలంటే వారంతా టెట్ తప్పనిసరిగా పాసై ఉండాలి.






