Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే?

బంగారం ధరలు(Gold Rates) నిన్న హిస్టరీ క్రియేట్ చేశాయి. లైవ్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్షకు పైగా పలికింది. దీంతో బంగారు ఆభరణాలు(Gold Jewellery) కొనుగోలు చేసేవారు షాకయ్యారు. దీంతో నిన్న ఒక్కరోజే నింగిని తాకిన ధరలు ఈరోజు (ఏప్రిల్ 23) శాంతించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో(International Market) బంగారం ధరలు క్రితం రోజుతో పోలిస్తే భారీగా దిగివచ్చాయి. క్రితం రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3151 డాలర్లపైన ఉండగా అది ఇవాళ 3112 డాలర్ల కిందకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు(Silver Price) ఔన్సుకు 31.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Gold Jewelry – Significance, Designs & Trends in India
10 గ్రాముల బంగారంపై రూ.3 వేలు తగ్గింది

ఇక ఇవాళ  హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.3,000 తగ్గి రూ.98,350కి చేరింది. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది. అటు స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఇవాళ కూడా లాభాల్లో మొదలయ్యాయి. Sensex 487 పాయింట్లు పుంజుకొని 80,086 వద్ద ట్రేడవుతోంది. Nifty 139 పాయింట్లు ఎగబాకి 24,306 దగ్గర కొనసాగుతోంది. ఇండియన్ రూపాయి మారకం విలువ(Rupee Value) రూ.85.403 డాలర్లుగా ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *