MAD Square : ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’.. ఇక నవ్వులే నవ్వులు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే మరింత ఎక్కువగా నవ్వులు పూయించింది. మొద‌టి పార్ట్‌లో న‌టించిన నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్‌, రామ్ నితిన్ లు ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు.

మ్యాడ్ స్క్వేర్ అప్డేట్

మార్చి 28వ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా (MAD Square Release Date) సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ మూవీని థియేటర్లోల చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేసారు. ఈ చిత్రం రిలీజ్ అయిన సమయంలో చెప్పుకోదగ్గ చిత్రాలు లేకపోవడంతో మళ్లీ మళ్లీ చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక థియేటర్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ చూడాలనుకున్న వారు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్

ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ న్యూస్ ను తాజాగా షేర్ చేసుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ మూవీ (MAD Square Ott News) ఓటీటీలోకి వచ్చేసిందని తెలిపారు. ప్రముఖ ఓటీటీ  ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో ప్ర‌స్తుతం ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ ను జాలీగా మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *