Manchu Vishnu : ప్రభాస్ లెజెండ్ కాదు సాధారణ నటుడు.. ఎంత మాటన్నాడు సార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ కు భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులున్నారు. ప్రభాస్ మూవీ నుంచి ఒక్క అప్డేట్ వస్తే చాలు ట్రెండింగులో నంబర్ వన్ చేసేస్తుంటారు ఆయన ఫ్యాన్స్. ఎన్ని ఫ్యాన్ వార్స్ జరుగుతున్నా.. మిగతా హీరోల అభిమానులు ఎంత మంది హీరోలపై విమర్శలు, ట్రోలింగ్ చేసినా.. ప్రభాస్ వద్దకు వచ్చే సరికి అందరూ ఒక్కటైపోతారు. అంతటి క్రేజు దక్కించుకున్న డార్లింగ్ గురించి నటుడు మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

Image

ప్రభాస్ లెజెండ్ కాదు

మోహన్ బాబు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా ‘కన్నప్ప (Kannappa)’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా  జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విష్ణు (Manchu Vishnu) ప్రమోషన్స్ షురూ చేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రుద్ర అనే ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా ఓ ప్ర‌మోష‌నల్ ఈవెంట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో ప్ర‌భాస్ సాధార‌ణ‌ యాక్ట‌ర్ మాత్ర‌మేనని.. లెజెండ్ యాక్ట‌ర్ కాదని వ్యాఖ్యానించాడు. ఆయ‌న లెజెండ్‌గా మార‌డానికి ఇంకా స‌మ‌యం పడుతుందని పేర్కొన్నాడు.

Image

మంచు విష్ణుపై ట్రోలింగ్

కానీ, మోహ‌న్‌లాల్ (Mohan Lal) మాత్రం లెజెండ‌రీ యాక్ట‌ర్‌ అని.. ఎందుకంటే కాలం ఆయ‌న్ను లెజెండ‌రీ న‌టుడిని చేసిందని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.  రాబోయే కాలంలో ప్ర‌భాస్ చేసే సినిమాలు త‌ప్ప‌కుండా ఏదో ఒక‌రోజు ఆయ‌న్ను లెజెండ్‌ను చేస్తాయి అంటూ వ్యాఖ్యానించాడు. అయితే విష్ణు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. డార్లింగ్ నే లెజెండ్ కాదంటావా అంటూ విష్ణుపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ప్రభాస్ పాత్ర కోసమే కన్నప్ప చూడాలని అనుకున్నామని.. లేకపోతే ఆ సినిమా జోలికే వెళ్లేవాళ్లం కాదని ఫైర్ అవుతున్నారు. గొప్ప నటుడికి పట్టుకుని సాధారణ యాక్టర్ అని ఎలా అంటారంటూ మండిపడుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *