NC24: నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తన తర్వాతి ప్రాజెక్టుతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు(Kartheek Dandu) డైరెక్షన్లో నాగ చైతన్య 24వ చిత్రం తెరకెక్కుతోంది. ‘NC24’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాగా పాన్ ఇండియా(Pan India) రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీలుక్ పోస్టర్‌(Pre-Look Poster)ను ఇది వరకే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల నాగచైతన్య మేకోవర్ లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ గురించి మరో న్యూస్ బయటికొచ్చింది. ఇంతకీ అదేంటంటే..?

ట్రెజర్ హంటింగ్ నేపథ్యంలో..

పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ‘NC24’ మూవీలో చైతూ ఇదివరెప్పుడూ చేయని రోల్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ గురించి ఓ న్యూస్ సినీటౌన్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ట్రెజర్ హంటింగ్(Tresure Hunting) నేపథ్యంలో మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో ఉంటుందని చైతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కెరీర్‌లోనే ఇది భారీ చిత్రమని తెలిపారు. ఈ క్రమంలో మూవీ టైటిల్ పేరును ‘వృష కర్మ(Vrusha Karma)’గా ఆయన రివీల్ చేసినట్లుగా ఓ వీడియో వైరలవుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ మూవీలో చైతూ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Choudari) హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *