టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni).. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం మహేశ్ బాబు.పి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RAPO22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు చూస్తే తెలుస్తోంది. సాగర్ అనే కుర్రాడి పాత్రలో ఈ చిత్రంలో రామ్ లుక్ వింటేజ్ లో కనిపిస్తోంది.
మోహన్ లాల్ నుంచి నో రెస్పాన్స్
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ తనకు సూటయ్యే లవర్ బాయ్ పాత్రతో వస్తున్నాడు. ఈ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Thaluka)’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ స్టార్ నటుడిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకోసం మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్(Mohan Lal)ను సంప్రదించారట.
కన్నడ స్టార్ కీ రోల్
అయితే ప్రస్తుతం యంగ్ హీరోల కంటే సూపర్ బిజీగా ఉన్నారు మోహన్ లాల్. ఈ క్రమంలో ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దీంతో ఈ అవకాశం కాస్త కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర (Actor Upendra) వద్దకు వెళ్లిందట. మేకర్స్ ఈ నటుడికి కథ వినిపించగా సానుకూలంగా స్పందించారట. దాదాపు ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం ఉపేంద్ర ఓకే అయ్యారట. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






