Sharwa38 : శర్వానంద్-అనుపమ కాంబోలో మరో మూవీ

టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఆయన తన సినీ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్టుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను శ్రీసత్యసాయి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.

శర్వా హీరోయిన్ వచ్చేసింది 

తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. శర్వానంద్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran) నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో అనుపమ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Image

మేలో షూటింగ్ ప్రారంభం

ఇక ఈ సినిమా కోసం శర్వానంద్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. మే ఫస్ట్ వీక్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో భారీ సెట్ రెడీ చేశారు.  ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో (bheems ceciroleo) మ్యూజిక్ అందిస్తున్నారు. శర్వానంద్, అనుపమ కలిసి గతంలో శతమానంభవతి అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఈ జంట పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే మ్యాజిక్ ను ఈ చిత్రంలోనూ చూపిస్తారా చూడాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *