INDIA : పాకిస్థాన్‌ యూట్యూబ్‌ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడి ఘటన (Pahalgam Attack)కు ప్రతీకారంగా ఆ దేశంతో ఉన్న సంబంధాలను భారత్ పూర్తిగా తెంపేసుకుంటోంది. ఇప్పటికే భారత్ లో ఉన్న ఆ దేశ పౌరులందర్నీ తమ స్వస్థలాలకు పంపిస్తోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అటారీ సరిహద్దు మూసివేసింది. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

16 ఛానెళ్లు బ్యాన్

పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్ల(Pakistan YouTube Channels)పై కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోం శాఖ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  డాన్‌ న్యూస్‌, సమా, జియో న్యూస్‌, ARY తదితర 16 యుట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం విధించినట్లు తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత రెచ్చగొట్టే ప్రచారం, మతపరమైన సమస్యాత్మక కంటెంట్‌, తప్పుదారి పట్టించే సమాచారం ప్రసారం చేయడమే కాకుండా భారత్‌, సైనిక బలగాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంటూ వీటిని బ్యాన్ చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *