Nani : రాజమౌళి ‘మహాభారతం’లో నాని.. కన్ఫమ్ చేసిన జక్కన్న

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం మాట్లాడుకుంటోంది. అయితే దీని గురించి జక్కన్న మాత్రం ఒక్క అప్డేట్ కూడా వదలడం లేదు. అయితే తాజాగా ఆయన నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 3’ (HIT 3) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ మహేశ్ బాబు సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వమని కోరారు.

మహాభారతంలో నాని

‘SSMB29’ గురించి ఏదైనా అప్‌డేట్‌ ఇవ్వమని కోరగా రాజమౌళి నవ్వి ఊరుకున్నారు. ఇక ‘మీ డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాభారతం’లో నాని పాత్ర ఫిక్స్‌ అయిందంటూ వార్తలొచ్చాయి. నిజమేనా?’ అని యాంకర్ సుమ (Anchor Suma) అడగ్గా.. తప్పకుండా ఆ ప్రాజెక్టులో నాని ఉంటాడనేది ఫిక్స్‌ అని రాజమౌళి అన్నారు. అయితే నాని క్యారెక్టర్‌ గురించి మాత్రం ప్రస్తావించలేదు. ‘మహాభారతం (MahaBharatham)’.. రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. మహేశ్ బాబుతో సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.

ప్రేక్షకులను థ్రిల్ చేసే వయోలెన్స్

ఇక హిట్3 సినిమా సంగతికి వస్తే నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కేజీయఫ్ ఫేం శ్రీనిధి శెట్టి ( Srinidhi Shetty) హీరోయిన్‌. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ మూడో సినిమా మే 1వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆదివారం రోజున నిర్వహించిన హిట్-3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు రాజమౌళి (Rajamouli) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ‘హిట్‌ 1’ హీరో విశ్వక్‌సేన్‌, ‘హిట్‌ 2’ హీరో అడివి శేష్‌ సందడి చేశారు. ఇక హిట్-3 గురించి జక్కన్న మాట్లాడుతూ.. టీజర్‌, ట్రైలర్‌ చూసి ఈ సినిమాలో ఎక్కువగా వయలెన్స్‌ ఉందనుకుంటున్నారు కానీ, అది ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా చేస్తుందని అన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *