నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పద్మ భూషణ్(Padma Bhushan) పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) చేతుల మీదుగా బాలయ్యబాబు పద్మ భూషన్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు దనం ఉట్టిపడేలా సంప్రదాయబద్ధమైన పంచెకట్టులో హాజరయ్యారు. కాగా, సినీరంగంలో విశేషంగా సేవలు అందించినందుకు గాను బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి..
ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బాలయ్యతో పాటు డా.దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (పద్మ విభూషణ్), మందకృష్ణ మాదిగ (పద్మ శ్రీ), తమిళ నటుడు అజిత్ (పద్మ భూషణ్), APకి చెందిన KL కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పద్మ శ్రీ అందుకున్నారు. కాగా గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations 2025) వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Padmabhushan shri Nandamuri Balakrishna🦁🦁
Idi chudataniki entho mandhi enno kallatho chusthunnaru 🥹🥹🙏🙏#JaiBalayya #NandamuriBalakrishna #PadmabhsuhanNBK #PadmaBhushan #PadmaAwards #GodOfMassesNBK #AndhraPradesh pic.twitter.com/f9c7IE8Vgb— చిలకలూరిపేట వేటగాడు😎 (@CHILAKALURIPET_) April 28, 2025






