ఇటీవల జమ్మూకశ్మీర్(J&K)లోని పహల్గామ్(Pahalgam) ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి(Terrorist attack on tourists) ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండిస్తున్నారు. తాజాగా, ఈ ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి(Imraan Hashmi) తీవ్రంగా స్పందించారు.
పక్కా ప్రణాళికతో జరిగింది..
ఉగ్రవాదుల దాడి(Terrorist Attack)ని తీవ్రంగా ఖండించిన ఇమ్రాన్.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి ఎలాంటి మతం ఉండదని, దానిని ఏ మతంతోనూ ముడిపెట్టరాదని ఆయన అన్నారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడి పక్కా ప్రణాళిక(Plan)తో జరిగిందని అభిప్రాయపడ్డారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Guy films himself going down a zip line during recent jihadist terror attack in India while people are actively being killed below him 👀
He seemingly has no idea despite the fact that you can see and hear AK fire in the background….#SituationalAwareness… https://t.co/dUCmsQ4WEF
— Mrgunsngear (@Mrgunsngear) April 28, 2025
పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ విమర్శలకు దారితీసింది. పలు దేశాల అధినేతలు ఈ దాడిని ఖండించారు. మానవత్వంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. కాగా ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాల(Security forces) ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.






