SSMB29: రాజమౌళి-మహేశ్ బాబు మూవీ కోసం భారీ సెట్!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేశ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్(Shooting) పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షూట్‌పైన ఫోకస్ చేసింది. తాజాగా దీనికి సంబంధించి ఓ న్యూస్ టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం ఓ భారీ సెట్‌ను రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Is Rajamouli-Mahesh Babu's new epic based on Kashi's legacy?
జూన్ 10 నుంచి తదుపరి షూటింగ్

టాలీవుడ్ సినిమాల్లో వారణాసి(Varanasi) నగరానికి ప్రత్యేకత ఉంది. చాలా సినిమాలు వారణాసి నేపథ్యంలో రూపొందాయి. తాజాగా వచ్చిన ప్రభాస్(Prabhas) కల్కి(Kalki Movie) చిత్రంలో కూడా వారణాసి ఉంటుంది. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా కోసం కూడా వారణాసి నగరాన్ని సృష్టిస్తున్నారని సమాచారం. ఇప్పటికే కొంత షూట్ పూర్తి చేసిన మేకర్స్ జూన్ 10 నుంచి తదుపరి చిత్రీకరణ షురూ చేయనున్నారట. ఈమేరకు వారణాసి సెట్‌(Varanasi Set) కోసం ఆర్ట్ డిపార్టుమెంట్ శ్రమిస్తోందట. ఇందులోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.

దాదాపు రూ.వెయ్యి కోట్ల బడ్జెడ్‌తో..

ప్రస్తుతం ఈ సెట్‌కి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్(Release) చేసే అవకాశం ఉంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.1000కోట్ల వ్యయంతో డా. KL నారాయణ నిర్మిస్తున్నారు. కీరవాణి(Kiravani) సంగీతం అందిస్తున్నారు.

Kashi and Lord Shiva to Play Key Roles in SS Rajamouli's SSMB29

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *