ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 213/5 భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు జాకబ్ బెథెల్ (33 బంతుల్లో 55), విరాట్ కోహ్లీ (33 బంతుల్లో 62) పరుగులతో తొలి వికెట్‌కు 97 రన్స్ భాగస్వామ్యం అందించారు. అనంతరం ముఖ్యంగా కోహ్లీ 5 సిక్సర్లు, 5 ఫోర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటయ్యాక పడిక్కల్ (17), పాటీదార్ (11), జితేశ్ (7) నిరాశపర్చారు.
ఆకాశమే హద్దుగా..
చివర్లో టిమ్ డేవిడ్(2*), విండీస్ వీరుడు రొమారియో షెఫర్డ్(Romario Shepherd) ఆకాశమే హద్దుగా చెలరేగాడు కేవలం 14 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఖలీల్ వేసిన 19వ ఓవర్లో షెఫర్డ్ ఏకంగా 33 పరుగులు (6,6,4,6,NB6,0,4) బాదాడు. దీంతో ఈ సీజన్‌లోనే తక్కువ బంతుల్లో(14) హాఫ్ సెంచరీ చేసిన రికార్డును షెఫర్డ్ తనపేరిట లిఖించుకున్నాడు. షెఫర్డ్ విధ్వంసంతో ఆర్సీబీ 213 భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో పతిరణ 3, నూర్ అహ్మద్, సామ్ కరన్ చెరో వికెట్ పడగొట్టారు. చెన్నై గెలవాలంటే 20 ఓవర్లలో 214 రన్స్ చేయాలి.
Romario Shepherd vs Khaleel Ahmed 19th Over Ball-By-Ball🔥🔥
pic.twitter.com/ae5OLam5yS— A (@cmmoncheeks) May 3, 2025






