మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohan Lal) నటిస్తున్న కొత్త కుటుంబ కథా చిత్రం ‘హృదయపూర్వం (Hridayapoorvam)’ షూటింగ్(Shooting) పూర్తయింది. ఈ మేరకు మోహన్‌లాల్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటోను, సినిమా టైటిల్(Title)తో ఉన్న క్లాప్‌బోర్డ్ చిత్రాన్ని షేర్ చేస్తూ “ప్యాకప్! త్వరలో పెద్ద తెరపై కలుద్దాం” అని రాసుకొచ్చారు.
That’s a wrap! See you on the big screen. #Hridayapoorvam pic.twitter.com/L4JCBmpQxO
— Mohanlal (@Mohanlal) May 19, 2025
‘హృదయపూర్వం’ సినిమాకు ప్రముఖ దర్శకుడు సత్యన్ అంతికాడ్(Director Sathyan Anthikad) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన కుమారుడు అఖిల్ సత్యన్(Akhil Satyan) ఈ చిత్రానికి కథ అందించారు. 2015లో వచ్చిన ‘ఎన్నుమ్ ఎప్పోళుమ్’ తర్వాత మోహన్‌లాల్, సత్యన్ అంతికాడ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి.
ఆగస్టు 28న థియేటర్లలో..
ఈ సినిమా షూటింగ్ కొచ్చి, పుణె(Pune) నగరాల్లో జరిగింది. ఇందులో మోహన్‌లాల్ సరసన మాళవిక మోహనన్(Malavika Mohanan) నటిస్తుండగా, సంగీత మాధవన్ నాయర్, సిద్ధిక్, బాబురాజ్, లాలూ అలెక్స్, జనార్దనన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.








