బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) హీరోగా నటిస్తున్న మూవీ ‘ఘటికాచలం’ (Ghatikachalam). అమర్ కామెపల్లి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘వెలుతురు నిన్ను తొక్కేస్తోంది. చీకట్లోకి రా’ అతీత శక్తి హీరోను పిలవడం, మూవీ టేకింగ్, ఇతర అంశాలు మూవీపై ఆసక్తిని రేపుతున్నాయి.






