Rukmini Vasanth: ప్రభాస్ ‘స్పిరిట్’లో కన్నడ బ్యూటీ రుక్మిణి!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో ‘స్పిరిట్’ (Spirit) మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వెల్లడించారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ సరసన కన్నడ క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రుక్మిణి.. ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్తో మూవీలో ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

దీపికా పదుకొణెను కాదని..

ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే ‘స్పిరిట్’ యూనిట్‌లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ వంగా.. నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న ఈ మూవీ కోసం దీపికా పదుకొణే(Deepika Padukone)ని తీసుకోవాలని భావించారు. అయితే దీపిక భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం, మరిన్ని కారణాలతో ఆమెని ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ రుక్మిణి వసంత్ను సంప్రదించడం.. అందుకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో రానుందంటూ ప్రచారం జరుగుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *