
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఛార్జీలు పెంచడంతో వచ్చిన విమర్శలతో ఎల్ అంటీ టీ సంస్థ కాస్త వెనక్కి తగ్గింది. ఛార్జీలను తగ్గిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ తగ్గించిన ఛార్జీలు శనివారం నుంచి అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలను సంస్థ రిలీజ్ చేసింది. రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 2 నుంచి 3 కి.మీ వరకు రూ.18 నుంచి రూ.17కి సవరించారు. 4 నుంచి 6 కి.మీ వరకు రూ.30 నుంచి రూ.28కి, 6 నుంచి 9 కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.40 నుంచి రూ.37కి తగ్గించారు. మే 15న మెట్రో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే..
తగ్గించిన ఛార్జీల వివరాలు ఇలా..
* 9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీలు రూ.50 నుంచి రూ.47కి తగ్గింపు
* 12 నుంచి 15 కి.మీ వరకు రూ.55 నుంచి రూ.51కి తగ్గింపు
* 15 నుంచి 18 కి.మీ వరకు రూ.60 నుంచి రూ.56కి తగ్గింపు
* 18 నుంచి 21 కి.మీ వరకు రూ.66 నుంచి రూ.61కి తగ్గింపు
* 21 నుంచి 24 కి.మీ వరకు రూ.70 నుంచి రూ.65కి తగ్గింపు
* 24 కిలోమీటర్లకు పైగా రూ.75 నుంచి రూ.69కి తగ్గింపు.