Kriti Sanon: మద్యం బ్రాండ్‌కు అంబాసిడర్‌గా కృతి సనన్.. ఫ్యాన్స్ ఫైర్

ఈ మధ్య హీరోయిన్లు(Heroins) సినిమాల కన్నా ఎక్కువగా యాడ్స్‌(Advertisements)తో బాగా పాపులర్ అవుతున్నారు. పలు రకాల వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలతో పోలిస్తే వీటితోనే ఎక్కువగా డబ్బులను సంపాదిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడ్డ కొందరు హీరోయిన్లు కొన్ని అసాంఘిక యాడ్స్‌లలోనూ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) అడ్డంగా ఇరుక్కుంది. ఓ లిక్కర్ యాడ్(Liquor ad) చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియా(SM)లో హాట్ టాపిక్ అవుతుంది.

 

పౌరాణిక పాత్రలో నటించి..

 

ప్రముఖ వోడ్కా కంపెనీ మ్యాజిక్ మూమెంట్స్‌(Magic Movements)కు కృతి సనన్ బ్రాండ్ అంబాసిడర్‌(Brand Ambassador)గా ఎంపికైంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కృతి యువతను మద్యం తాగమని ఇన్‌డైరెక్ట్‌గా సలహా ఇస్తుందని ఆమెపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా ‘ఆదిపురుష్’ సినిమాలో సీత(Sitha)గా పౌరాణిక పాత్రలో నటించిన ఆమె.. ఇప్పుడు వోడ్కా(Vodka) తాగమంటూ ప్రచారం చేయడం ఎవరికీ నచ్చడం లేదు.

 

యూత్‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నావంటూ ఫైర్

 

అసలు ఇది సరైన పద్ధతే కాదంటూ.. సీత పాత్రలో నటించిన నువ్వు వోడ్క తాగమని యూత్‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నావో అర్థం అవుతోందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీగా ఉన్నప్పుడు కాస్త సామాజిక బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఇలా సమాజాన్ని చెడగొట్టే దిశగా పలు యాడ్స్, ప్రచారాలు చేయడమేంటని మండిపడుతున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *