థియేటర్ల వద్ద ‘ఖలేజా’ రీ రిలీజ్ (Khaleja Rerelease) హంగామా నడుస్తోంది. మహేశ్ అభిమానులు ఖలేజా రీరిలీజ్‌కు క్యూ కట్టారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఖలేజీ (Khaleja) రీరిలీజ్, థియేటర్ల వద్ద అభిమానులు రచ్చరచ్చ చేస్తున్న పోస్టులే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీ రిలీజ్‌కు కళ్లు చెదిరే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఖలేజాకు ఏకంగా ప్రీమియర్స్
రీ రిలీజ్ ట్రెండ్‌లో మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మురారి, బిజినెస్‌మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాలని రీ రిలీజ్ చేయగా.. అభిమానులు థియేటర్లలో భారీగా సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఖలేజాను కూడా మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈ మూవీకి ఏకంగా ప్రీమియర్స్ కూడా వేశారు. కాగా ‘ఖలేజా’ రీ రిలీజ్లో రికార్డ్స్ సృష్టించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మొత్తం రూ.6.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే అసలు నంబర్స్ మాత్రం నిర్మాణ సంస్థ రిలీజ్ చేయలేదు. థియేటర్ల వద్ద ప్రేక్షకుల హడావుడి చూస్తుంటే వసూళ్లు భారీగానే వచ్చాయని అనిపిస్తుంది.

అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు ఫేవరెట్
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, అనుష్క (Anushka) నటించిన ‘ఖలేజా’. 2010లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అప్పుడు డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత టీవీల్లో వచ్చినప్పుడు మాత్రం ఎగబడి చూశారు. చాలామందికి ఇది ఫేవరెట్ మూవీగా నిలిచింది. దీంతో ఇప్పుడు రీ రిలీజ్ చేయడంతో ఆ మూవీ మీద ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటున్నారు. వచ్చే శుక్రవారం వరకు ఖలేజాను పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు.








