
ఏపీ సర్కార్(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు పౌర సేవల(Civil Services)ను వాట్సాప్, ఆన్‌లైన్(Online) ద్వారా అందిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరో కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు కరెంట్ బిల్లుల్ని(Electricity Bills) చాలా ఈజీగా కట్టేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై జస్ట్ క్యూఆర్ కోడ్(QR Code) ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. ఈ విధానం జూన్ నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గతంలో Phone Pay, G Pay వంటి వాటి ద్వారా కరెంట్ బిల్లులు కట్టే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ప్రజలు బిల్లులు కట్టడానికి మళ్లీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ఈ సమస్యను అధిగమించడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చారు.
సమయం ఆదా అవుతుంది..
క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించే విధానం వల్ల ప్రజలకు చాలా సులువు(Easy) అంటున్నారు. ఈ నెలలో జారీ చేస్తున్న విద్యుత్ బిల్లుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా స్కాన్ చేయాలి. వెంటనే బిల్లు మొత్తం కనిపిస్తుంది. వినియోగదారుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేస్తే బిల్లు చెల్లింపు పూర్తవుతుంది. ఈ సరికొత్త విధానం ప్రభుత్వ సర్వీసుల(Govt Services)కు వర్తించదని తెలుస్తోంది. ఈ కొత్త పద్ధతి ద్వారా సమయం ఆదా అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.