తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం ‘భూభారతి’ (Bhu Bhrathi) అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (జూన్ 3) నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు(Farmers) భూ సమస్యల్లో చిక్కుకున్నారని మండిపడ్డారు. రెవెన్యూ వ్యవస్థలో ఆ రోజుల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్ది, భూ పరిపాలనను ప్రజలకు సమీపంగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ లక్ష్యంతో ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భూభారతి చట్టాన్ని ప్రారంభించారని తెలిపారు.
త్వరలోనే 6 వేల సర్వేయర్లను నియామకం
పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాకో మండలంలో ఈ చట్టాన్ని అమలు చేశామన్నారు. ఇప్పుడు జూన్ 3 నుంచి 20 వరకు ‘ప్రజల వద్దకే రెవెన్యూ’ నినాదంతో రాష్ట్రంలోని మిగిలిన మండలాల్లో సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి తహశీల్దార్(MRO) నేతృత్వంలో ఒక బృందం వెళ్లి, ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు(Applications on land issues) స్వీకరించి, వాటిని పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే రాబోయే రెండు నెలల్లో మొదటి దశలో 6,000 సర్వేయర్ల(Surveyors)ను నియమిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.






